you must know

Why and What is Digital Marketing

ప్రియమైన కస్టమర్లుకి, శ్రేయోభిలాషులకు  మరియు మిత్రులకు

మన కంపెని లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రారంభించాము

ఇది బిజినెస్ చేసే వారికి, కొత్తగా ప్రారంభించే  వారికి, అంతే కాకుండా తమ బిజినెస్ మరింత సేల్స్ లేదా అభివృద్ధి కావాలనేవారికి ఉపయోగపడుతుంది.

డిజిటల్ మార్కెటింగ్  అంటే ఏమిటి..?.

ఈ రోజులలో బిజినెస్ అవసరాల కొరకో, విద్యా ఉపాధి అవసరాల కొరకో 99% మొబైల్ తో గడిపేవారు ఉన్నారు.  ప్రతి ఒక్కరు facebook , instagram , youtube మరియు google సెర్చ్ వాడుతున్నారు. వీటిలో ప్రకటనలు ఇవ్వటమే డిజిటల్ మార్కెటింగ్.

ప్రకటనల కొరకు  డిజిటల్ మార్కెటింగ్గే ఎందుకు …?

ఒక ప్రకటన మనం ఇవ్వాలంటే దానికి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటారు.

అవి ఏమిటంటే..!

ప్రకటన కలర్ లోన, లేదా బ్లాక్ అండ్ వైట్ లోన ,

ఏ సైజు లో ,

ఏ ప్రాంతం లో రావాలి.

తదుపరి మన సాంప్రదాయ పద్ధతులైన టీవీ, పేపర్ మరియు రేడియోలలో ఒక్కటి ఎంచుకొని, దానిలో మళ్ళి దేనికి ఎక్కువ ప్రాచుర్యం వుందో తెలుసుకొని ప్రకటన ఇస్తాము.

ఇక్కడ ఒక్కక్క అంశానికి ఒక్కో ధర ఉంటుంది. కావలసిన అంశాల ధరలన్నీ కోడీకరించుకొని ఎక్కువ అనిపిస్తే మానేస్తాము, తప్పదు అనుకుంటే ఒక అడుగు ముందుకు వేస్తాము.

పైన చెప్పుకున్న అంశాలన్నీ మనకు నచ్చిన బడ్జెట్ లో వచ్చే అవకాశం డిజిటల్ మార్కెటింగ్  లో దొరుకుతుంది. అంతే కాకుండా సాంప్రదాయ పద్ధతులలో కొన్ని ప్రయోజనాలు లేకపోవటం వలన డిజిటల్ మార్కెటింగ్  ప్రాచుర్యం లోకి వచ్చింది.

అవి ఏమిటంటే..!

ఎంత మంది మన ప్రకటన వీక్షించారు

ఏ ప్రాంతం వారు వీక్షించారు

ఆడ వారు ఎంత మంది, మగ వారు ఎంత మంది,

ఏ వయస్సు వారు ఎంత మంది వీక్షించారు

ప్రకటన నచ్చిన వారు ఎంత మంది,

మన ప్రకటన నచ్చి ఎంత మంది షేర్ చేసారు,

నేరుగా వారి అభిప్రాయాలను మన ప్రకటనతో పంపియటం.

ఈ విధంగా Performance మరియు Demographics తెలుసుకోవచ్చు

తక్కువ ధరలో , బిజినెస్ అభివృద్ధికి ఉపయోగపడే  డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలనుకునే వారు నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి.

ధన్యవాదాలు.