Why should I have a page online?

why web page online..!

నేను ఎందుకు ఆన్లైన్లో ఒక పేజీ కలిగివుండాలి?

నేటి డిజిటల్ యుగంలో, ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉండటం కేవలం ఒక ఎంపిక కాదు; అది ఒక అవసరం.

మీరు వ్యక్తి అయినా, చిన్న వ్యాపార యజమాని అయినా లేదా పెద్ద సంస్థ అయినా,

ఆన్‌లైన్‌లో వెబ్‌పేజీని కలిగి ఉండటం వలన మీ వ్యక్తిగత బ్రాండ్ లేదా వ్యాపార విజయాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ఇది ఇంటర్నెట్ యుగం, అందరు ఎక్కువగా కనపడేది ఆన్లైన్ లోనే. మన వ్యాపారం అందరికి అందుబాటులో ఉన్నపుడే, మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

ఆన్లైన్లో మన వ్యాపారం ఉన్నందున మన వ్యాపార చిరునామా, మన సర్వీస్ ఎలా ఉంటుందో..

ఎంత ధరకి ఇస్తామో, వస్తువు ఏ విధంగా ఉంది అని తెలుసుకొని వినియోగదారులు త్వరగా సంప్రదిస్తారు.

అంతే కాకుండా వారు మన సర్వీస్, ధర నచ్చి నేరుగా అభిప్రాయాలు తెలుపుతారు. దీని వలన కోత్త వినియోగదారులు పెరుగుతారు.

చాలా మంది 1. ఒక మంచి అడ్డా చూసుకొని, 2. ఎవరు పెట్టని వ్యాపారం పెడితే సరిపోతుందని అనుకొంటారు.

ఒక వేళా చెప్పుకున్న 2 అంశాలను తీసుకుంటే అటువైపుగా వచ్చిన వారిలో కొంత మంది రావచ్చు లేదా

మన బంధువులు మరియు స్నేహితులు రావచ్చు. వీరిలో అందరికి మీ వస్తువులు ప్రతి రోజు అవసరం ఉండకపోవచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మన వ్యాపారం అందరికి అందుబాటులో ఉందా, లేదా అని అలాగే మనకు ఉన్న వ్యాపారస్తుల పోటీ ఎలా తట్టుకోవాలో తెలుసుకోవాలి.

ఒకవేళ ఆన్లైన్లో మనకంటూ ఒక పేజీ ఉంటే దానిలో గూగుల్ మ్యాప్ లో మన లొకేషన్ , చిరునామా, మొబైల్ నెంబర్ , మీరు మీ ఉత్పత్తులు మరియు సేవలను స్పష్టంగా చూపించవచ్చు. అలాగే మన దగ్గర ఉన్న వస్తువు లేదా సర్వీస్ కొరకు వెతికినప్పుడు మన పేజీ వారికీ కనిపించిన మనల్ని సంప్రదిస్తారు.